సోమవారం 28 సెప్టెంబర్ 2020
International - Jul 31, 2020 , 19:05:04

వియత్నంలో తొలి కరోనా మరణం నమోదు

వియత్నంలో తొలి కరోనా మరణం నమోదు

హానోయ్‌ : వియత్నంలో తొలి కరోనా మరణం నమోదైంది. డానాంగ్‌లో ఇటీవల ఓ వృద్ధుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇదే ఆ దేశంలో మొదటి కరోనా మరణమని స్థానిక మీడియా తెలిపింది.100 రోజుల తరువాత గతవారం డానాంగ్లో కరోనా కేసులు వెలుగు చూడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు తక్షణ చర్యలకు ఉపక్రమించారు. డానాంగ్ నుంచి హానోయి వచ్చిన వారిందరికీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన కరోనా నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు. జులై 1 నుంచి 29 వరకు డానాంగ్‌లో పర్యటించిన వారందరికీ గురువారం నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. శనివారం లోగా పరీక్షలు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. శుక్రవారం ఆ దేశంలో 45 కరోనా పాటిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇదే ఇప్పటివరకు అత్యధికం. వియత్నంలో ఇప్పటివరకు కేవలం 509 మంది మాత్రమే కరోనా బారిపడ్డారు.  


logo