శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Jul 26, 2020 , 02:59:37

వన్యప్రాణుల దిగుమతులపై నిషేధం

వన్యప్రాణుల దిగుమతులపై నిషేధం

హనోయ్‌: జంతువుల్లోని ప్రమాదకర వైరస్‌లు మనుషులకు సోకే ప్రమాదం ఉండటంతో వన్యప్రాణుల దిగుమతులపై వియత్నాం నిషేధం విధించింది. ప్రాణంతో ఉన్నవాటితోపాటు చనిపోయిన ప్రాణులను కూడా దేశంలోకి అనుమతించేదిలేదని స్పష్టంచేసింది. వన్యప్రాణుల గుడ్లు, లార్వాల దిగుమతులపై కూడా నిషేధం విధించింది. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కొవిడ్‌-19 చైనాలో గబ్బిలాల నుంచి మనుషులకు సోకినట్టు తేలటంతో వియత్నాం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.  


logo