సోమవారం 06 ఏప్రిల్ 2020
International - Mar 07, 2020 , 00:42:19

రోడ్లపై మృతదేహాల వీడియోలు ఫేక్‌

రోడ్లపై మృతదేహాల వీడియోలు ఫేక్‌
  • కరోనా నియంత్రణకు గట్టి చర్యలు తీసుకున్నారు.. మా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టారు
  • వుహాన్‌ నుంచి తిరిగొచ్చిన భారతీయ విద్యార్థి వెల్లడి

ఔరంగాబాద్‌: నిర్మానుష్య రహదారులు.. రోడ్లెక్కని ప్రైవేట్‌ వాహనాలు.. నిలిచిపోయిన ప్రజారవాణా వ్యవస్థ.. కరోనా వైరస్‌ తొలుత వెలుగుచూసిన చైనాలోని వుహాన్‌ నగరంలో పరిస్థితి ఇది. వుహాన్‌ నుంచి ఇటీవల తిరిగి వచ్చిన మహారాష్ట్రకు చెందిన విద్యార్థి ఆశిష్‌ కుర్మి.. అక్కడి అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. ఆయన వుహాన్‌లోని ఓ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ చదువుతున్నారు. వుహాన్‌లో తొలి కరోనా కేసు గతేడాది డిసెంబర్‌ 8న నమోదైనా, ఈ ఏడాది జనవరి మొదటి వారం వరకూ ఆ విషయం తమకు తెలియలేదని రాకపోకలపై తొలుత ఎలాంటి నియంత్రణలు లేవని, అయితే కేసులు క్రమేణా పెరుగడంతో నగరాన్ని అధికారులు దిగ్బంధించారని చెప్పారు. వుహాన్‌లో రోడ్లపైనే మృతదేహాలు పడి ఉన్నట్లు వచ్చిన వీడియోలు నకిలీవన్నారు. ఇండియాకు వచ్చిన తర్వాత తాను ఆ వీడియోలు చూసినట్లు పేర్కొన్నారు. 15 ఏండ్ల కిందట చైనాలో వ్యాపించిన సార్స్‌తో పోలిస్తే కరోనా వైరస్‌ మరణాల శాతం తక్కువని ఆశిష్‌ వివరించారు.


logo