గురువారం 01 అక్టోబర్ 2020
International - Aug 08, 2020 , 11:35:26

కిటికీ వ‌ద్ద నిలబ‌డి చూస్తున్న స‌మ‌యంలో ద‌డేల్ అనే పేలుడు.. జ‌స్ట్ త‌ప్పించుకున్నారు!

కిటికీ వ‌ద్ద నిలబ‌డి చూస్తున్న స‌మ‌యంలో ద‌డేల్ అనే పేలుడు.. జ‌స్ట్ త‌ప్పించుకున్నారు!

లెబ‌నాన్‌లో చోటు చేసుకున్న భారీ విద్వంసంలో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వేల‌మంది గాయాల‌పాల‌య్యారు. పేలుడు త‌ర్వాత కూడా మ‌ళ్లీ మ‌ళ్లీ పెద్ద గాలులు కెర‌టాల్లా ఇళ్ల మీద‌కి ప‌డుతున్నాయి. భారీ పేలుడు స‌మీపంలోని ప్రాంతాల్లో నివ‌సిస్తున్న వారంతా ప్రాణాల‌ను అర‌చేతిలో పెట్టుకొని జీవించారు. వీరి ఇండ్ల‌లో జ‌రిగిన విద్వంసం సీసీకెమెరా, మొబైళ్ల‌లో రికార్డ‌య్యాయి. వాటిని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్‌గా మారాయి.

ఇటీవ‌ల మ‌రొక వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది. ఇందు‌లో ముగ్గురు పిల్ల‌లు త‌మ ఇంట్లోని కిటికీ వ‌ద్ద నిల‌బ‌డి భారీ పేలుడుని చూస్తూ నిల్చున్నారు. ‌వీరితోపాటు ఒక ఆయా కూడా ఉంది. ఆ స‌మ‌యంలోనే  భారీ విస్ఫోట‌నం ఏర్ప‌డి కిటికీ అద్దాలు విరిగి ఇంటి లోప‌ల ప‌డ్డాయి. ఈ పిల్ల‌లు అక్క‌డే ఉండ‌డంతో ఒక‌రి మీద కిటికీ అద్దం ప‌డింది. ఇంకో కిటికీ చాలా వేగంతో వెళ్లి అక్క‌డున్న డైనింగ్ టేబుల్ మీద ప‌డింది. ఇది గ‌నుక వీరిలో ఎవ‌రికి త‌గిలున్న ప‌రిస్థితి విష‌మంలా మారేది. ఈ వీడియోను చూసిన‌వారంతా 'టైం గాడ్' అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

 


View this post on Instagram

مساكن الوليدات كانو كيشووفو داك الانفجار الاول من الزاج حتى تعاود الانفجار و طاح عليهم داكشي ???? . . . . . . . . . . . . #ابتسام_تسكت #دنيا_بطمه #اسماء_المنور #saadlamjarred #ايهاب_امير #المغرب #تركيا #فخر_العرب #ihabamir #كاظم_الساهر #souhilabenlachhab #مصر #مريم_سعيد #الخليج #السعودية #الجزائر #جيش_رغده #ibtissamtiskat #duniabatma #حلاالترك #فولو #البحرين #حسين_الجسمي #salmarachid #احلام_الشامسي #بيروت #لبنان

A post shared by عويشة الدريويشة ???? صفحة منوعة ???? (@lalla_3wicha_dwiiba) on


logo