శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Aug 03, 2020 , 19:13:21

ఆహారం కోసం ఎలుగుబంటి సైలెంట్‌గా ఏం చేసిందంటే.. వీడియో వైర‌ల్‌!

ఆహారం కోసం ఎలుగుబంటి సైలెంట్‌గా ఏం చేసిందంటే.. వీడియో వైర‌ల్‌!

ఆక‌లికోసం ఎన్ని ప‌నులైనా చేయాల్సి వ‌స్తుంది చేస్తాం కూడా. కొన్నిసార్లు ఆక‌లే అన్ని ప‌నులు నేర్పిస్తుంది. పాపం ఈ ఎలుగుబంటి ఎంత ఆక‌లితో ఉందో ఏమో. ఎక్క‌డా ఆహారం దొర‌క్క‌పోయే స‌రికి ఒక చెత్త‌బుట్ట‌ని ప‌క్క‌కు లాక్కెళ్లి ఆహారం కోసం వెతుకుతున్న‌ది. ఈ సంఘ‌ట‌న అక్క‌డే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది.

17 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోను అమెరిక‌న్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మ‌న్ 'ఓహ్ ఏమీ లేదు. రాత్రిపూట చెత్త‌ను బ‌య‌ట పెడుతుంది' అనే శీర్షిక‌తో ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ఈ సంఘ‌ట‌న ఫ్లోరిడాలో చోటు చేసుకున్న‌ది. ఎలుగుబంటి చెత్త డ‌బ్బాను వీలింగ్ ద్వారా మూల‌కు లాక్కెళ్లింది. త‌ర్వ‌త శ‌బ్దం చేయ‌కుండా తెలివిగా చెత్త డ‌బ్బాను కింద‌కు దింపి ఆహారం వెతుకుతున్న‌ది. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది. 

  


logo