రోడ్డుపై విమానం అత్యవసర ల్యాండింగ్‌.. వీడియో

Dec 05, 2020 , 13:29:28

వాషింగ్టన్‌ : అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రంలోని మిన్నియా పాలిస్‌ నగరంలోని హైపై సింగిల్‌ ఇంజిన్‌ విమానం అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. ఘటనకు సంబంధించిన వీడియోను మిన్నెసోటా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టాన్స్‌పోర్టేషన్ ట్విట్టర్‌లో పోస్టు చేయగా.. వైరల్‌గా మారింది. గత బుధవారం రాతి బెలాంకా వైకింగ్‌ విమానాన్ని క్రయిగ్‌ గిఫోర్డ్‌ అనే పైలట్‌ నడిపారు. సాంకేతిక లోపంతో అత్యవసర ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది. దీంతో మిన్నియా పాలిస్‌ హైవేపై ల్యాండ్‌ చేశాడు.. విమానం దిగిన తర్వాత వేగంగా వెళ్లి రోడ్డుపైనే వెళ్తున్న ఎస్‌యూవీ వాహనాన్ని ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ఎస్‌యూవీ వాహనంలో బ్రిట్నీ యూరిక్‌ అనే మహిళ మాట్లాడుతూ ప్రమాదానికి ముందు సెకనుపాటు విమానాన్ని చూశానని తెలిపారు.

ఘటన అనంతరం పైలట్‌తో మాట్లాడానని, పైలట్‌ తనకు క్షమాపణలు చెప్పాడని, ఇందుకు కారణాలు కూడా తెలిపాడని పేర్కొంది. రోడ్డుపైనే విమానం ల్యాండ్‌ అయిన ఘటను నేను ఇంకా నమ్మలేకపోతున్నానని చెప్పింది. కాగా, విమానం అత్యవసర ల్యాండింగ్‌కు కారణాలేంటో మాత్రం ఇంకా తెలియరాలేదు. ఘటనపై ఫెడరల్‌ అధికారులు విచారణ కూడా ప్రారంభించారు. గిఫర్డ్‌ ఇప్పటి వరకు 4500 గంటల వరకు వివిధ విమానాల్లో పైలట్‌గా పని చేసినట్లు ఇంటర్నేషనల్ ఏరోబాటిక్ క్లబ్ పేర్కొంది. అంతర్జాతీయ పోటీలో దక్షిణాఫ్రికాలో జరిగిన 2017 ప్రపంచ ఏరోబాటిక్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం పతకం కూడా సాధించాడు.


తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD