గురువారం 22 అక్టోబర్ 2020
International - Oct 01, 2020 , 13:21:47

చ‌దువుకోమంటే నిద్ర‌పోతున్న బాతుపిల్ల‌ : వీడియో వైర‌ల్

చ‌దువుకోమంటే నిద్ర‌పోతున్న బాతుపిల్ల‌ :  వీడియో వైర‌ల్

పిల్ల‌లు స్కూల్లో చాలా ఉత్సాహంగా ఉంటారు. టీచ‌ర్ల‌తో తిట్లు తిన‌డం, ఫ్రెండ్స్‌తో గొడ‌వ ప‌డుతూ ఎంజాయ్ చేస్తుంటారు. ఎంత ఎంజాయ్ చేసినా.. మ‌ధ్యాహ్నం భోజనం చేసిన త‌ర్వాత క్లాసులో పాఠాలు వింటుంటే నిద్ర‌పోవ‌డం మాత్రం ఖాయం. నిద్ర‌పోతున్నార‌ని ప‌నీష్‌మెంట్‌గా పిల్లాడిని నిల‌బెడ‌తారు  టీచ‌ర్‌. అయినా నిద్ర‌పోదు. నిల‌బ‌డి తూగుతూనే ఉంటారు పిల్ల‌లు. ఇలా మ‌నుషులు మాత్ర‌మే కాదు. ప‌క్షులు కూడా చేస్తాయి. చ‌దువుకోమంటే బాగా నిద్ర‌పోతాయి.

ఓ బాతుపిల్ల కూడా అలానే చేసింది. పుస్త‌కాల ప‌క్క‌న కూర్చొని తూగుతున్న‌ది. మ‌ధ్య మ‌ధ్య‌లో మెల‌కువ వ‌చ్చిన‌ప్పుడు చుట్టూచూసి మ‌ర‌లా నిద్ర‌పోయిం‌ది. ఆ బాతుపిల్ల‌కు అంత క‌ష్టం ఎందుకు. బాగా ప‌డుకొని  నిద్ర‌పోవ‌చ్చు క‌దా. దీనికి సంబంధించిన వీడియోను యూట్యూబ్ఇండియా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో నెటిజ‌న్ల‌ను బాగా ఆక‌ట్టుకుం‌ది. 'ఎవ‌రో చ‌దువుకోమ‌ని చెప్పినట్లున్నారు, చ‌దువుతుంటే పాపం బాతుకి నిద్రొచ్చి నిద్ర‌పోతున్న‌ది' అని వినియోగ‌దారులు కామెంట్లు పెడుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ వీడియోను 21 వేల‌మంది వీక్షించారు.

View this post on Instagram

Imma take a nap, imma take a nap right here.

A post shared by YouTube India (@youtubeindia) on


logo