శుక్రవారం 04 డిసెంబర్ 2020
International - Oct 20, 2020 , 18:41:57

మోడ్రన్‌ జట్కాబండి..!లాగేదెవరో తెలిస్తే షాకవుతారు..!

మోడ్రన్‌ జట్కాబండి..!లాగేదెవరో తెలిస్తే షాకవుతారు..!

వాషింగ్టన్‌: జట్కా అంటే సాధారణంగా మనకు గుర్రాలు గుర్తుకొస్తాయి. కొన్నిచోట్ల కుక్కలు లాగే జట్కాలు కూడా ఉన్నాయి. అయితే, ఓ రోబో.. జట్కా లాగడం మీరెప్పుడైనా చూశారా..?ఇలాంటి వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌ అవుతోంది. 

ఈ వీడియోలో అమెరికన్‌ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ డిజైనర్‌, టెలివిజన్‌ పర్సనాలిటీ ఆడం సావేజ్‌ తన జట్కాను లాగడానికి రోబో డాగ్‌ను వాడారు. ఆయన జట్కా ఎక్కి ‘మార్కెట్‌కు వెళ్లు’ అని ఆదేశించగానే రోబో ముందుకు దూసుకెళ్లింది. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు పోస్ట్‌ చేశారు. ఇప్పుడిది నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ‘స్పాట్’ అనే ఈ రోబో డాగ్‌ను అమెరికన్ ఇంజినీరింగ్, రోబోటిక్స్ డిజైన్ సంస్థ బోస్టన్ డైనమిక్స్ రూపొందించింది. కాగా, మైక్రో బ్లాగింగ్‌ వెబ్‌సైట్‌లో ఈ వీడియోను వేలాదిమంది వీక్షించారు.    

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.