మంగళవారం 27 అక్టోబర్ 2020
International - Sep 24, 2020 , 19:13:41

బీచ్ వ‌ద్ద వింత జీవి.. అంద‌రినీ భ‌య‌పెడుతుంది!

బీచ్ వ‌ద్ద వింత జీవి.. అంద‌రినీ భ‌య‌పెడుతుంది!

స‌ముద్ర జీవుల వీడియోలు సోష‌ల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. కొన్ని వీడియోలు నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటుంటే మ‌రికొన్ని భ‌య‌పెడుతుంటాయి. బాలిలోని స‌ముద్రం వ‌ద్ద ఒక అరుదైన జెల‌టిన‌స్ జీవి అంద‌రినీ భ‌య‌పెడుతున్న‌ది. దీనికి సంబంధించిన వీడియో ఇంట‌ర్‌నెట్‌లో చ‌క్క‌ర్లు కొడుతుం‌ది. ఈ వీడియోను నేచ‌ర్ ఈజ్ స్కేరీ అనే ఖాతా ట్విట‌ర్‌లో పోస్ట్ చేసింది. 'బాలిలోని స‌ముద్ర‌పు అడుగుభాగంలో క‌నిపించే వింత జీవి' అనే శీర్షిక‌ను జోడించారు.   

15 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోలో జెలాటిన‌స్ జీవి న‌డుస్తున్న‌ట్లు చూపిస్తుంది. ఈ జీవి చూడ్డానికి అస్థిపంజ‌రంలా క‌నిపిస్తుంది. అంటే అస్థిపంజ‌రానికి ఎముక‌లు ఉండే ప్ర‌దేశంలో దీనికి లోబ్‌లున్నాయి. ఒకానొక స‌మ‌యంలో అది నోరు తెరిచి ప్ర‌దేశాన్ని విస్త‌రించ‌డం చూడొచ్చు. త‌ర్వాత మ‌ళ్లీ సాధార‌ణ ప‌రిమాణానికి తీసుకు వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో చూసిన‌ప్పుడు కొంచెం భ‌యం వేస్తుంది. అయితే ఈ వీడియోను 2016లో చిత్రీక‌రించారు. కానీ ఇప్పుడు మళ్లీ వైర‌ల్ అయింది. ఈ వీడియోను ఇప్ప‌టివ‌ర‌కు 1.1 మిలియన్‌ల మంది వీక్షించారు. 

తాజావార్తలు


logo