గురువారం 13 ఆగస్టు 2020
International - Aug 01, 2020 , 12:53:50

టీవీలో మ్యాచ్ చూస్తూ ఊగిపోతున్న కుక్క‌.. పాపం కింద ప‌డిపోయింది!

టీవీలో మ్యాచ్ చూస్తూ ఊగిపోతున్న కుక్క‌.. పాపం కింద ప‌డిపోయింది!

క్రికెట్ మ్యాచ్ వ‌స్తుందంటే చాలు. టీవీలో వ‌చ్చే సీరియ‌ల్లు, సినిమాల‌న్నీ బంద్‌. ఎవ‌రింట్లో వాళ్లు కూర్చొని కూడా క్రికెట్ చూడ‌రు. అంతా ఒక‌చోట చేరి క్రికెట్ మ్యాచ్ చూస్తుంటారు. అభిమాన క్రికెట‌ర్ ఫోర్‌, సిక్స్ కొడితే చాలు ఇంట్లో వీళ్ల హ‌డావుడి ఎక్కువ‌గా ఉంటుంది. అవుట్ అయితే అంతా డీలా ప‌డిపోతారు. అంత ఇష్టం క్రికెట్ అంటే. ఒక్క క్రికెట్ మాత్ర‌మే కాదు చాలా క్రీడ‌ల‌ను ఇలానే ఇష్ట‌ప‌డుతారు. ఈ మ్యాచ్‌ల పిచ్చి ఒక్క మ‌నుషుల‌కే కాదు జంతువుల‌కు కూడా ఉంటుంది,

10 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడి‌యోలో ఒక కుక్క మ్యాచ్ చూస్తూ ఊగిపోతున్న‌ది. య‌జ‌మాని క‌న్నా ఈ కుక్క‌కే ఆ ఆట అంటే ఇష్టంలాగ ఉంది. అస‌లు అటు ఇటు కూడా చూడ‌కుండా టీవీ వైపే చూస్తుంది. స్పోర్ట్స్‌మెన్స్ ఆనందంగా ఉంటే కుక్క క్లాప్స్ కొడుతూ సంబ‌ర‌ప‌డిపోతున్న‌ది. ఈ ఆనందంతో సోఫా మీద నుంచి కింద ప‌డిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను అమెరిక‌న్ మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మ‌న్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు. క్రీడ‌లంటే ఇష్ట‌ప‌డే వారంద‌రికీ ఈ వీడియో న‌చ్చేసుంటుంది. 


   


logo