మంగళవారం 27 అక్టోబర్ 2020
International - Oct 10, 2020 , 15:50:20

ర‌స‌గుల్లా స్వీట్‌తో బిర్యాని.. తింటే మ‌తిపోతుంది!

ర‌స‌గుల్లా స్వీట్‌తో బిర్యాని.. తింటే మ‌తిపోతుంది!

స్పైసీగా ఉండే బిర్యానీ, తియ్య‌గా ఉండే స్వీట్‌కి అస‌లు పోలిక ఉండ‌దు. రుచుల‌లో రెండూ విభిన్న‌మైన‌వి. ఒక‌టి కారం, రెండోది తీపి. సాధార‌ణంగా బిర్యానీ తిన్న త‌ర్వాత స్వీట్ తింటారు. అలా తింటే హాయిగా ఉంటుంది. కానీ ఈ చెఫ్ ఎవ‌రో కాని వినూత్న ప్ర‌యోగం చేశాడు. స్వీట్‌, బిర్యాని రెండింటినీ క‌లిపేశాడు. ఏకంగా ర‌స‌గుల్లాతో బిర్యానీ త‌యారు చేసి అందిరినీ షాక్‌కు గురి చేశాడు. దీనికి 'ర‌స‌గుల్లా బిర్యాని' అని పేరు పెట్టారు. ఈ మ‌ధ్య చాలామంది ఫుడ్ మీద ప్ర‌యోగాలు చేయ‌డం మొద‌లుపెట్టారు.

మొన్న‌టికి మొన్న దోశ రూపురేఖ‌లు మార్చేశారు. ఇప్పుడు బిర్యాని. కొత్త డిషెస్‌ని ఇష్ట‌ప‌డే వాళ్లు త‌ప్ప ఎవరూ ఇలాంటివి ఇష్ట‌ప‌డ‌రు. ముఖ్యంగా బిర్యానీ ప్రియులు చూశారంటే అస‌లు త‌ట్టుకోలేరు. దీనిని ‘మాడ్లీ ఫుడ్ లవర్’ అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో ‘అంగూరి రసగుల్లా బిర్యానీ’ వంటకాన్ని పోస్ట్ చేశారు. స్వీట్లు ఇష్టపడే బెంగాలీ ప్రజల కోసం అక్కడి హోటళ్లు ఇలాంటి బిర్యానీలతో ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. మ‌రి ర‌స‌గుల్లా బిర్యానీ ఎలా ఉందో ఓసారి చూసేయండి. 


logo