సోమర్సెట్: రికార్డుల కోసం కొంత మంది ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు. అలాంటిదే ఎప్పటిదో 17 ఏళ్ల కిందటి సాహసానికి చెందిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్( Viral Video )గా మారింది. యూకేలోని సోమర్సెట్ సమీపంలో 6522 మీటర్ల ఎత్తులో ఓ వ్యక్తి రెండు హాట్ బెలూన్ల మధ్య నడిచి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఈ వీడియోను ఇప్పుడు గిన్నిస్ బుక్ మరోసారి తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. మైక్ హోవార్డ్ అనే వ్యక్తి చేసిన ఈ సాహసానికి చెందిన వీడియో తెగ వైరల్ అవుతోంది. 50 ఏళ్లు, 50 రికార్డులు టీవీ షో కోసం 2004, సెప్టెంబర్ 1న ఈ వీడియోను తీశారు.