బీజింగ్, ఆగస్టు 30: పిల్లలు ఆన్లైన్ వీడియో గేమ్‌లు ఆడటంపై చైనా కఠినమైన నిబంధనలు విధించింది. వారాంతాల్లో, సెలవు రోజుల్లో కేవలం ఒక గంట మాత్రమే వీడియో గేమ్‌లు ఆడుకోవడానికి అనుమతించింది. అది కూడా రాత్రి 8-9 గంటల మధ్యే ఆడుకోవాలి. వేరే సమయాల్లో పిల్లలు గేమ్‌లు ఆడకుండా చర్యలు తీసుకోవాలని గేమింగ్ కంపెనీలను చైనా ఆదేశించింది. అంతకుముందు రోజూ గంటన్నర, సెలవు రోజుల్లో మూడు గంటల పాటు గేమ్‌లు ఆడుకోవడానికి అనుమతి ఉండేది. వీడియో గేమ్‌ల వల్ల పిల్లలు ఫోన్లకే అతుక్కుపోవడంపై ఆందోళనలు వ్యక్తం కావడంతో చైనా ఈ నిర్ణయం తీసుకొన్నది.