బుధవారం 08 జూలై 2020
International - Jun 05, 2020 , 18:37:09

టీఆర్ఎస్ ఎన్నారై శాఖల ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్

టీఆర్ఎస్ ఎన్నారై శాఖల ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్ : కరోనా రక్కసి ప్రపంచాన్నిపట్టి పీడిస్తున్న నేపథ్యంలో తెలంగాణ బిడ్డల యోగ క్షేమాలను తెలుసుకునేందుకు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపేందుకు మొట్టమొదటి సారిగా అన్ని దేశాల్లో ఉన్న టీఆర్ఎస్ ఎన్నారై శాఖల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ను (భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 5:30) టీఆర్ఎస్ ఎన్నారై శాఖల కోఆర్డినటర్ మహేష్ బిగాల నిర్వహించనున్నారు. రోజురోజుకు కరోనా మహమ్మారి బారిన పడి పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నది. మృతుల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది.

 ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ వాసుల సాధక బాధలు తెలుసుకునేందుకు ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. అలాగే వారి బాధలను సాధ్యమైనంత మేరకు పరిష్కరించేందుకు ఇది దోహదం చేస్తుందన్నారు. ఈ విపత్కర సమయంలో మహేష్ బిగాల ఎన్నోరకాలుగా టీఆర్ఎస్ ఎన్నారై శాఖలతో కలిసి వారి వారి దేశాల్లో వీలైనంత సహాయాన్ని అందిస్తున్నారు. 


logo