గురువారం 04 జూన్ 2020
International - May 14, 2020 , 16:34:04

ఉడుత ఆసనాలు వేయడం ఎప్పుడైనా చూశారా?

ఉడుత ఆసనాలు వేయడం ఎప్పుడైనా చూశారా?

లాక్‌డౌన్‌లో యోగాశ్ర‌మాల‌కు, జిమ్‌ల‌కు వెళ్ల‌డానికి వీలుండ‌దు. అందుకే ఈ ఉడుత చేసే ఆస‌నం వేసేయండి. బాగా గాలిని పీలుస్తూ.. వ‌దులుతూ ఉండాలి. ఈ ప‌నులు చేసేట‌ప్పుడు శ‌బ్దం కూడా రావాలి. అప్పుడే స‌రిగ్గా చేసిన‌ట్లు. ఇది జ‌నాద‌ర‌ణ పొందిన ఆస‌నాల్లో క‌ప‌ల్‌భ‌టిలో ఒక‌టి. ఉద‌రం త్వ‌రిత‌గ‌తిన లోప‌లికి, బ‌య‌టికి క‌దులుతూ క‌ప‌ల్బ‌తి యోగాను గుర్తుచేస్తున్న‌ది. చెక్క‌మీద యోగా చేస్తున్న ఉడుత వీడియో వివిధ సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల‌లో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సాకేత్ బ‌డోలా షేర్ చేశాడు. ఈ ఆస‌నం చూసిన వారంద‌రూ బాబా ఉడుతా(స్క్వెరల్‌) దేవ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.logo