మంగళవారం 31 మార్చి 2020
International - Mar 27, 2020 , 13:28:36

కోవిడ్-19 స‌మాచారం కోసం విన్నూత్న సైట్లు !

కోవిడ్-19 స‌మాచారం కోసం విన్నూత్న సైట్లు !

కోవిడ్‌-19 ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తుంది. పేద దేశం, ధ‌నిక దేశం అని తేడా లేకుండా అన్ని దేశాల‌ను భ‌య‌భ్రాంత‌ల‌కు గురిచేస్తుంది. అయితే మొద‌టి ద‌శ‌లో ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. కానీ కాలం గ‌డిచే కొద్ది దీని తీవ్ర‌త పెర‌గ‌డంతో అంద‌రూ భ‌యానికి లోన‌వతున్నారు.  మొద‌ట్లో దీనిపై లెక్క‌లు కూడా స‌రిగా తెలియ‌లేదు. కానీ రోజులు గ‌డుస్తుండ‌టంతో అంద‌రూ దీనిపై అల‌ర్ట్ అవుతున్నారు. ప్ర‌తీక్ష‌ణం అప్‌డేట్ అవుతూ స‌మాచారాన్ని ప్ర‌పంచానికి వెల్ల‌డిస్తున్నారు. దీనికోసం ప‌లు సైట్లు ప‌నిచేస్తున్నాయి. అంద‌రికీ సుల‌భంగా ఏ దేశంలో ఎంత‌మంది దీని బారిన ప‌డ్డారు, ఎంత‌మంది చ‌నిపోయారు, ఎంత మంది రిక‌వ‌ర్ అయ్యారు అనే అంశాల‌ను తెలియ‌జేయ‌డానికి 360 డిగ్రీలో తిరిగే   గ్లోబ్ మ్యాప్ ద్వార స‌మాచారాన్ని అందిస్తున్నారు. అలాంటి వెబ్‌సైట్ల‌ల‌లో ఒక‌టి https://www.covidvisualizer.com/ అదే విధంగా మ‌న దేశంలో అప్‌డేట్‌ల‌ను ఐసీఎంఆర్ https://icmr.nic.in/content/covid-19 త‌దిత‌ర సైట్లు ప‌నిచేస్తున్నాయి. logo
>>>>>>