బైడెన్ ప్రభుత్వంలో మరో ఎన్నారైకి కీలక పదవి

వాషింగ్టన్: అమెరికా అసోసియేట్ అటార్నీ జనరల్‌గా భారత సంతతికి చెందిన మహిళా న్యాయవాది వనితా గుప్త నియమితులయ్యారు. కొత్తగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వనితా గుప్తను అసోసియేట్ అటార్నీ జనరల్ పదవికి ఎంపిక చేశారు. అమెరికా క్యాపిటల్‌పై దాడి అనంతరం కొనసాగుతున్న రాజకీయాల మధ్య వనితా గుప్త నియామకం జరుగడం విశేషం. వనితా గుప్త నియామకాన్ని సెనేట్ ఆమోదించిన పక్షంలో.. అమెరికా చరిత్రలో ఈ స్థానానికి చేరుకున్న మొదటి నల్లజాతి మహిళ అవుతుంది. పౌర హక్కుల కోసం పోరాడుతున్న వనితా గుప్త.. అమెరికాలో అత్యంత గౌరవనీయమైన న్యాయవాదులలో ఒకరని కొత్త అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. నిరుపేదలకు న్యాయం చేయడానికి ఎంతో కష్టపడ్డారని చెప్పారు. వనితా గుప్త గతంలో న్యాయ శాఖలో డిప్యూటీ అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా, బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పౌర హక్కుల విభాగం అధిపతిగా సేవలందించారు. ఆ సమయంలో బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.
కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు జో బైడెన్ తన సొంత ప్రావిన్స్ అయిన డెలావేర్‌లోని విల్మింగ్టన్లో మీడియాతో మాట్లాడాతూ.. అసోసియేట్ అటార్నీ జనరల్ న్యాయ శాఖలో మూడవ ప్రముఖ స్థానం, దీనికి వనితా గుప్తాను నామినేట్ చేస్తున్నాను అని ప్రకటించారు. వనితా గుప్త తన కెరీర్‌ను నేషనల్ అసోసియేషన్ ఆఫ్ కలర్డ్ పీపుల్ (ఎన్ఏసీపీ) లీగల్ డిఫెన్స్ ఫండ్‌తో ప్రారంభించారు.
38 మంది విడుదలతో వెలుగులోకి..
ఎన్ఏసీపీలో పనిచేస్తున్న సమయంలో లా స్కూల్ నుంచి 38 మందిని వరుసగా విడుదల చేసినప్పుడు వనితా గుప్త పేరు వెలుగులోకి వచ్చింది. విడుదలైన వారిలో ఎక్కువ మంది ఆఫ్రికన్-అమెరికన్లు. టెక్సాస్‌లోని ఒక పట్టణంలో మాదకద్రవ్యాల ఆరోపణలపై తప్పుగా శిక్షకు గురయ్యారు. ఈ కేసులో పోరాడి 6 మిలియన్ల భారీ మొత్తాన్ని పరిహారంగా ఇప్పించడంలో వనితా గుప్త కృషిచేశారు.
అమెరికాలోని అతిపెద్ద మానవ హక్కుల సంస్థ అయిన అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్‌కు స్టాఫ్ అడ్వకేట్‌గా కూడా పనిచేశారు. వలసదారులు, సామూహిక అరెస్టుల బాధితుల అనేక కేసులను లేవనెత్తి న్యాయం దక్కేలా చేయగలిగారు. ‘ఈ నామినేషన్ భారతదేశం నుంచి అమెరికాకు వలస వచ్చినవారికి గర్వకారణం. ఇది పౌర హక్కుల ఉద్యమం, 1965 నాటి ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనలిటీ యాక్ట్ ద్వారా సాధ్యమైంది. ఇకపై, అమెరికా పార్లమెంటుపై దాడులు ఉండవు’ అని వనిత గుప్తా అన్నారు. మన విలువలు, మన రాజ్యాంగం, మన ప్రజాస్వామ్యం.. వాటికవే రక్షించుకోలేవని, అది దేశంలోని సాహసోపేత ప్రజలచే సాధ్యమని ఈ సంఘటన మనకు గుర్తు చేస్తుందని చెప్పారు. ఇలాంటి క్లిష్ట సమయంలో దేశానికి కఠినమైన నాయకత్వం అవసరమని వనిత స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
జై జవాన్, జై కిసాన్ నినాదం ఆయన ఊపిరి
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- గండిపేటకు పర్యాటక సొబగులు..డిజైన్ రెడీ
- హర్భజన్‌ను వదులుకున్న చెన్నై సూపర్ కింగ్స్
- కోల్డ్ స్టోరేజ్‌లో1,000 కొవిషీల్డ్ డోసులు ధ్వంసం
- ఆర్మీ యూనిఫాంలో రైతు నిరసనల్లో పాల్గొనవద్దు..
- రిషబ్ పంత్‌కు కెరీర్ బెస్ట్ ర్యాంక్
- 60 దేశాల్లో యూకే కరోనా వేరియంట్..
- మహేశ్ బాబు స్కిన్ స్పెషలిస్ట్ ఈమెనే..!
- సీఎం పదవికి కేటీఆర్ సమర్థుడు : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
- రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో పొడి వాతావరణం : ఐఎండీ
- లక్కీ ఛాన్స్ కొట్టేసిన థమన్