బుధవారం 03 జూన్ 2020
International - May 17, 2020 , 15:51:01

మాల్దీవుల నుంచి షిప్‌లలో దేశానికి రానున్న 15 వందల మంది...

మాల్దీవుల నుంచి షిప్‌లలో దేశానికి రానున్న 15 వందల మంది...

కరోనా విజృంభనతో అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షల కారణంగా మాల్దీవుల్లో చిక్కుకున్న గర్భిణీ స్త్రీలు, పిల్లలతో సహా దాదాపు 1,500 మంది భారతీయ పౌరులను దేశానికి తీసుకువస్తున్నట్లు భారత హైకమిషన్‌ ఆదివారం తెలిపింది. ” వందే భారత్‌ మిషన్‌”లో భాగంగా నావికాదళ ఓడల ద్వారా భారతీయులను తీసుకువస్తన్నారు. కరోనా వైరస్‌ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను తిరిగి తీసుకురావడానికి భారత ప్రభుత్వం మే 7 న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 

మిషన్‌ మొదటి దశలో ప్రభుత్వం గల్ఫ్‌, యుఎస్‌, యుకె, ఫిలిప్పీన్స్‌, బంగ్లాదేశ్‌, మలేషియా, మాల్దీవులు వంటి ఇతర దేశాల నుంచి మొత్తం 6,527 మంది భారతీయులను తీసుకురావడం జరిగింది. మాల్దీవుల నుంచి దేశంలోని 22 రాష్ర్టాలకు చెందిన 1488 మంది భారతీయులు వచ్చే వారంలో దేశానికి చేరుకోనున్నారు. ఇందులో 205 మంది మహిళలు, 133 గర్భిణీ ఇతర వైద్య సహాయం కావాల్సిన వారు,  38 మంది పిల్లలు ఉన్నారు. వీరు షిప్‌ ద్వారా తమిళనాడు తీరానికి చేరుకోనున్నారు.


logo