వ్యాక్సిన్ల సామర్థ్యంపై బ్రిటన్ మంత్రి హెచ్చరిక

లండన్ : కరోనా వైరస్ నూతన స్ట్రెయిన్లపై వ్యాక్సిన్ల ప్రభావం తక్కువగానే ఉంటుందని బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి హంకాక్ ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిటన్లో ఇప్పటివరకూ యాభై లక్షల మందికి పైగా వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన వైరస్ రకంపై వ్యాక్సిన్ల ప్రభావంపై ప్రభుత్వం పరీక్షలు జరుపుతోందని చెప్పారు.
దక్షిణాఫ్రికా, బ్రెజిల్లో కనుగొన్న కొత్తరకం కరోనా వైరస్ కేసులపై కోవిడ్-19 వ్యాక్సిన్లు పరిమిత ప్రభావం చూపుతాయయని ఆయన హెచ్చరించారు. నూతన రకం వైరస్ల తీవ్రత మనకు ఇంకా తెలియదని స్కైన్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హంకాక్ పేర్కొన్నారు. అప్పటివరకూ కొత్త వైరస్లను నూతన ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా మనం నిరోధించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వైరస్ సరికొత్త రూపాల్లో దాడి చేయడం ఆందోళనకరమని చెప్పారు.
తాజావార్తలు
- అభివృద్ధి పనుల్లో జాప్యం చేయొద్దు..
- వాస్తవాలకు అండగా నిలువండి
- ఆకట్టుకునేలా.. అక్కంపల్లి
- సీఎం సారూ.. మీ మేలు మరువం
- మాధవపల్లి సర్పంచ్, కార్యదర్శులకు నోటీసులు
- జోరుగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు
- ఆహ్లాదం పంచని ప్రకృతి వనం!
- బలహీనంగా ఉన్న పిల్లలకు రెట్టింపు పౌష్టికాహారం
- మాతా శిశు మరణాల శాతం తగ్గించాలి
- రసవత్తరంగా రణరంగం