ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Sep 10, 2020 , 20:01:04

ట్రయల్స్‌ తాత్కాలికంగా ఆపేసినా.. ఏడాది చివరినాటికి ఆక్స్‌ఫర్డ్‌ టీకా: ఆస్ట్రాజెనెకా

ట్రయల్స్‌ తాత్కాలికంగా ఆపేసినా.. ఏడాది చివరినాటికి ఆక్స్‌ఫర్డ్‌ టీకా: ఆస్ట్రాజెనెకా

లండన్‌: ఆక్స్‌ఫర్డ్‌ కొవిడ్ -19 వ్యాక్సిన్ క్లినికల్‌ ట్రయల్స్‌ను తాత్కాలికంగా నిలిపేసినా.. ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి తీసుకువస్తామని ప్రసిద్ధ ఔషధ సంస్థ ఆస్ట్రాజెనెకా స్పష్టం చేసింది. ఈ ఏడాది చివరినాటికి లేదా వచ్చే ఏడాది ఆరంభంలో మార్కెట్‌లో టీకా ఉంటుందని యూకేకు చెందిన ఆ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పాస్కల్ సోరియట్ ఓ మీడియా కార్యక్రమంలో వెల్లడించారు.  

ఆక్స్‌ఫర్డ్‌ టీకా తీసుకున్న ఓ వలంటీర్‌ అస్వస్థతకు గురికావడంతో ఈ క్లినికల్‌ ట్రయల్స్‌ను  తాత్కాలికంగా స్వచ్ఛందంగా నిలిపివేస్తున్నట్లు ఆస్ట్రాజెనెకా బుధవారం ప్రకటించింది. ఈ వ్యాక్సిన్‌ భద్రతను సమీక్షించడానికి ఒక స్వతంత్ర కమిటీని రూపొందించారు. అయితే, ఇది ట్రయల్స్  సమగ్రతను కాపాడటానికి రూపొందించిన సాధారణ చర్య అని కంపెనీ తెలిపింది. ట్రయల్స్ మళ్లీ ఎప్పుడు ప్రారంభించవచ్చో ఈ కమిటీ తమకు మార్గనిర్దేశం చేస్తుందని సోరియట్ తెలిపారు. త్వరలోనే క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభిస్తామని ధీమా వ్యక్తంచేశారు. కాగా, కొవిడ్‌ వ్యాక్సిన్‌ను ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకుల సహాయంతో ఆస్టాజెనెకా అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నడుస్తున్నాయి. ప్రపంచంలో తుది దశ ట్రయల్స్‌లో ఉన్న తొమ్మిదో టీకాల్లో ఆక్స్‌ఫర్డ్‌ టీకా ఒకటి. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo