బుధవారం 03 జూన్ 2020
International - Apr 16, 2020 , 11:24:52

క‌రోనా నిర్మూల‌న‌కు వాక్సిన్ ఒక్క‌టే మార్గం: గుటెర్ర‌స్‌

క‌రోనా నిర్మూల‌న‌కు వాక్సిన్ ఒక్క‌టే మార్గం: గుటెర్ర‌స్‌

న్యూఢిల్లీ: ప‌్ర‌పంచ దేశాల‌ను క‌రోనా వైరస్ గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న‌ది. ఇప్ప‌టికే ల‌క్షల మంది ఆ మ‌హ‌మ్మారి బారినప‌డి ఆస్ప‌త్రుల పాల‌య్యారు. దాదాపు ల‌క్ష మందికిపైగా మృతిచెందారు. లాక్‌డౌన్ కార‌ణంగా ప‌లు దేశాల్లో రవాణా, వాణిజ్య, పారిశ్రామిక రంగాలతో పాటు ఎన్నో ఉపాధి రంగాలు మూతబడ్డాయి. ఈ నేప‌థ్యంలో ఐరాస‌లో స‌భ్య‌త్వం క‌లిగిన 50 ఆఫ్రికా దేశాల అధినేత‌ల‌తో ఐక్యురాజ్య‌స‌మితి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆంటోనియా గుటెర్ర‌స్ వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. 

ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ఆయ‌న క‌రోనా వైర‌స్‌ను పూర్తిగా నిర్మూలించాలంటే సరైన వ్యాక్సిన్‌ను కనుగొనడం ఒక్క‌టే మార్గమని గుటెర్ర‌స్ అభిప్రాయ‌ప‌డ్డారు. సాధ్య‌మైనంత తొంద‌ర‌గా వ్యాక్సిన్‌ను క‌నిపెడితే.. లక్షల మంది జీవితాలను కాపాడ‌టంతోపాటు లక్షల కోట్ల డబ్బును ఆదా చేయవ‌చ్చని పేర్కొన్నారు. కొవిడ్‌ 19కు సరైన వ్యాక్సిన్‌ను కనుగొంటేనే ప్రపంచం తిరిగి కోలుకునే అవకాశం ఉంద‌న్నారు. 

క‌రోనా వ్యాక్సిన్‌ను త్వరగా కనుగొనాలని, అది విశ్వవ్యాప్తంగా అందరికీ ఉపయోగపడేలా ఉండాలని పేర్కొన్న గుటెర్ర‌స్‌.. 2020 చివరి నాటికి కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి వ‌స్తుండొచ్చ‌ని ఆశాభావం వ్యక్తంచేశారు. ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా 47 ఆఫ్రికా దేశాల్లో కరోనా పరీక్షలు జరిపించడానికి సన్నద్ధమైందని ఐరాస సెక్రెట‌రీ జ‌న‌ర‌ల్ తెలిపారు. కరోనా మహమ్మారి పరిణామాలను తగ్గించడానికి పలు దేశాలు చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo