గురువారం 04 జూన్ 2020
International - Apr 18, 2020 , 13:33:50

సెప్టెంబ‌ర్‌లో క‌రోనాకు వ్యాక్సిన్‌, బ్రిట‌న్ సైంటిస్టుల వెల్ల‌డీ

సెప్టెంబ‌ర్‌లో క‌రోనాకు వ్యాక్సిన్‌, బ్రిట‌న్ సైంటిస్టుల వెల్ల‌డీ

లండన్: క‌రోనా మ‌హ‌మ్మారి రోజురోజుకు మ‌రింత‌ విజృంబిస్తోంది. 22ల‌క్ష‌లకు పైగా దీని బారిన ప‌డ‌గా...ల‌క్ష 50వేల మంది ప్రాణాల‌ను బ‌లిగొంది. మ‌రెంత‌మందిని ప్రాణాల‌ను హ‌రిస్తుందో తెలియ‌ని ప‌రిస్థితి ఉన్న‌ది.  అందుకే వీలైనంత త‌ర్వ‌గా దీనిని అంత‌మొందించేందుకు విశ్వ‌వ్యాప్తంగా అనేక ప‌రిశోధ‌న‌లు జ‌రుపుతూనే ఉన్నారు. తాజాగా కరోనా నివారణకు తాము కనిపెట్టిన వ్యాక్సిన్ సెప్టెంబర్ లో అందుబాటులోకి వస్తుందని ఆక్స్ ఫర్డ్ సైంటిస్టులు చెప్పారు. దీని కోసం వివిధ కంపెనీలు, దాతలతో కలిసి పని చేస్తున్నామన్నారు. 

ఇది క‌రోనాపై ఎఫెక్టివ్ గా పని చేస్తద‌ని... సెప్టెంబర్ నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తామ‌ని పేర్కొన్నారు. ఇందుకు మూడు ఫేజ్ లో క్లినికల్ ట్రయల్స్ నడుస్తున్నాయ‌ని చెప్పారు.అటు  ఇతర టెక్నాలజీతో తయారు చేసిన వ్యాక్సిన్లు రెండు లేదా ఎక్కువ డోస్ లు కావాలని, తాము తయారు చేసిన వ్యాక్సిన్ సింగిల్ డోస్ చాలని అన్నారు. క్లినికల్ ట్రయల్స్ కు ముందే వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. ఏడు కంపెనీలతో కలిసి వ్యాక్సిన్ తయారు చేస్తున్నమ‌ని  తెలిపారు. బ్రిటన్ లో మూడు, యూరప్ లో రెండు, చైనా, ఇండియాలో ఒక్కో కంపెనీ త‌యారీలో భాగస్వామిగా ఉన్నట్లు చెప్పారు.


logo