బుధవారం 27 జనవరి 2021
International - Dec 23, 2020 , 02:06:53

టీకా వేసుకున్న బైడెన్‌

టీకా వేసుకున్న బైడెన్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌.. ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ సంస్థలు అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ను సోమవారం బహిరంగంగా వేసుకున్నారు. ప్రజలందరూ ఎలాంటి భయాలు లేకుండా వ్యాక్సిన్‌ను వేసుకోవాలని చెప్పడానికే తాను ఈ టీకాను తీసుకున్నట్టు చెప్పారు. అమెరికాలోని పలువురు ఇండో-అమెరికన్‌ వైద్యులు కూడా టీకా డోసులను వేసుకున్నారు. మరోవైపు, కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ కారణంగా కుంటుపడిన ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఉద్దేశించిన 900 బిలియన్‌ డాలర్ల (రూ.66.47 లక్షల కోట్లు) ఉద్దీపన ప్యాకేజీకి అమెరికన్‌ కాంగ్రెస్‌ సోమవారం ఆమోదం తెలిపింది.


logo