బుధవారం 15 జూలై 2020
International - Jun 04, 2020 , 01:08:42

యూవీ కిరణాలతో కరోనా ఖేల్‌ ఖతం..!

యూవీ కిరణాలతో కరోనా ఖేల్‌ ఖతం..!

న్యూయార్క్‌: కరోనాకు ఇప్పటిదాకా మందు లేదు. భౌతిక దూరం ఒక్కటే మార్గం. వ్యాక్సిన్ల తయారీలో శాస్త్రవేత్తలు బిజీగా ఉన్నా దానికి ఇంకా సమయం పడుతుంది. ఈలోగా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టారు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మిన్నెసోటా పరిశోధకులు. అతినీలలోహిత కిరణాలతో కరోనా భరతం పట్టవచ్చని గుర్తించి, ఆ కాంతి కిరణాలతో కూడిన ఒక పరికరాన్ని తయారు చేశారు. దాదాపు 200 నుంచి 300 నానో మీటర్ల మేర తీవ్రత కలిగిన అతినీలలోహిత కిరణాలను వైరస్‌పై పంపినపుడు అవి నశిస్తాయట. పునరుత్పత్తి గానీ, ఇన్ఫెక్షన్లకు గానీ అవకాశం లేకుండా శక్తిహీనమవుతాయట. ఈ పరికరం ఖరీదు చాలా ఎక్కువని, జీవిత కాలం తక్కువని పరిశోధకులు తెలిపారు. అందువల్ల ఎక్కువ సామర్థ్యమున్న యూవీ లైట్‌ ఎమిటింగ్‌ డయోడ్‌లను తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు.


logo