బుధవారం 03 జూన్ 2020
International - May 18, 2020 , 12:44:09

200 వెంటిలేట‌ర్లు ఇవ్వ‌నున్న అమెరికా..

200 వెంటిలేట‌ర్లు ఇవ్వ‌నున్న అమెరికా..

హైద‌రాబాద్‌: భార‌త్‌కు వెంటిలేట‌ర్లు విరాళం ఇవ్వ‌నున్న‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే అమెరికాకు చెందిన ఇంట‌ర్నేష‌న‌ల్ డెవ‌ల‌ప్మెంట్ ఏజెన్సీ.. భార‌త్‌కు 200 వెంటిలేట‌ర్లు విరాళం ఇవ్వ‌నున్న‌ట్లు తెలిసింది.  కోవిడ్‌19 మ‌హ‌మ్మారిని నియంత్రించే క్ర‌మంలో అగ్ర‌రాజ్యం అమెరికా మ‌న‌కు సాయం చేస్తున్న‌ది. రాబోయే నెల రోజుల్లో ఆ వెంటిలేట‌ర్లు మ‌నకు అంద‌నున్నాయి.  మే, జూన్ నెలల్లో.. రెండు ద‌ఫాల్లో వెంటిలేట‌ర్లు రానున్న‌ట్లు అధికార వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.  యూఎస్ఎయిడ్ నిధుల కింద వెంటిలేట‌ర్లు విరాళంగా ఇవ్వ‌నున్న‌ట్లు అమెరికా వెల్ల‌డించింది.  వాస్త‌వానికి అమెరికా అవ‌స‌రాల కోసం వెంటిలేట‌ర్లు త‌యారు చేశారు. ఇత‌ర దేశాలు కూడా ఆ వెంటిలేట‌ర్లు వాడుకునే విధంగా మారుస్తున్నారు. అయితే విరాళంలో భాగంగా కొన్నింటిని ఇండియాకు పంపిస్తున్న‌ట్లు వైట్‌హౌజ్ ప్రెస్ సెక్ర‌ట‌రీ కేలీగ్ మెక‌న్నీ తెలిపారు. ఇండియాలో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య  ల‌క్ష‌కు చేరువైంది.logo