బుధవారం 20 జనవరి 2021
International - Dec 28, 2020 , 13:35:05

అమెరికాలో ఒకేసారి నాలుగు చారిత్ర‌క సంక్షో‌భాలు: జో బైడెన్‌

అమెరికాలో ఒకేసారి నాలుగు చారిత్ర‌క సంక్షో‌భాలు: జో బైడెన్‌

వాషింగ్ట‌న్‌: అగ్ర రాజ్యం అమెరికా ఏక‌కాలంలో నాలుగు చారిత్ర‌క సంక్షోభాలను ఎదుర్కొంటున్న‌ద‌ని ఇటీవ‌ల ఆ దేశ‌ అధ్య‌క్షుడిగా ఎన్నికైన జో బైడెన్ వ్యాఖ్యానించారు. అయితే ఈ కాలానుగుణ స‌వాళ్ల‌ను ఎదుర్కోవ‌డంపై త‌న బృందం హార్డ్ వ‌ర్క్ చేస్తున్న‌ద‌ని ఆయ‌న చెప్పారు. తాను పదవీ బాధ్యతలు చేప‌ట్టిన వెంట‌నే ఈ స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న‌ వేళ అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ట్విట్టర్ ద్వారా ఈ వ్యాఖ్యలు చేశారు. 

ప్ర‌స్తుతం అమెరికా కొవిడ్-19 విజృంభణ‌, దెబ్బ‌తిన్న ఆర్థిక‌ వ్య‌వ‌స్థ, వాతావ‌రణ మార్పు, జాతివివ‌క్ష లాంటి నాలుగు చారిత్ర‌క సంక్షోభాల‌ను ఒకేసారి ఎదుర్కొంటున్న‌ద‌ని బైడెన్ ట్విట్ట‌ర్లో పేర్కొన్నారు. ఆ నాలుగు సంక్షోభాల నుంచి దేశాన్ని బయట పడేయడానికి జనవరిలో అధికార బాధ్యతలు స్వీకరించిన మొద‌టి రోజు నుంచే తాను, త‌న‌ బృందం చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, ఒక్కరోజును కూడా వృథా చేయబోమ‌ని చెప్పారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo