ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Jul 15, 2020 , 01:33:33

20 ఏండ్ల తర్వాత అమెరికాలో మరణశిక్ష అమలు

20 ఏండ్ల తర్వాత అమెరికాలో మరణశిక్ష అమలు

వాషింగ్టన్‌: అమెరికాలో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తొలిసారిగా మరణ శిక్షను అమలు చేశారు. ఓక్లహామాలోని యుకాన్‌ ప్రాంతానికి చెందిన డానియల్‌ లీ (47) అనే వ్యక్తికి విషపు ఇంజక్షన్‌ ఇచ్చి మంగళవారం అధికారులు మరణ శిక్షను అమలు చేశారు. తుపాకుల వ్యాపారి అయిన విలియం ముల్లెర్‌, ఆయన భార్య నాన్సీ, ఎనిమిదేండ్ల కుమారుడిని చంపిన ఓ కేసులో లీ దోషిగా తేలడంతో కోర్టు అతనికి మరణ దండన విధించింది. కాగా 2003 తర్వాత అమెరికాలో మరణ శిక్షను అమలు చేయడం ఇదే మొదటిసారి.


logo