శనివారం 30 మే 2020
International - May 16, 2020 , 07:22:54

భారత్‌కు విరాళంగా వెంటిలేటర్లు: డొనాల్డ్‌ ట్రంప్

భారత్‌కు విరాళంగా వెంటిలేటర్లు: డొనాల్డ్‌ ట్రంప్

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై పోరులో తాము భారత్‌తో కలిసి పనిచేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. వెంటిలేటర్లను భారత్‌కు విరాళంగా అందిస్తామని ఆయన ప్రకటించారు. ఈ విపత్తక్కర సమయంలో తాము భారతదేశానికి, ప్రధాని మోదీకి మద్దతుగా ఉంటామని చెప్పారు. ప్రధాని మోదీ తనకు మంచి మిత్రుడని వెళ్లడించారు. కరోనా వ్యాక్సిన్‌ తయారీలో రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని ఆయన ట్వీట్‌ చేశారు. ఇరు దేశాల్లో గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారని కొనియాడారు. కరోనా వ్యాక్సిన్‌ ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. అమెరికాలో చాలామంది భారతీయులు ఉంటున్నారని, వారు వ్యాక్సిన్‌ తయారీలో పాలుపంచుకుంటున్నారని తెలిపారు.


logo