శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Jul 28, 2020 , 20:15:05

షాంఘై స‌మీపంలోకి అమెరికా యుద్ధ విమానం!

షాంఘై స‌మీపంలోకి అమెరికా యుద్ధ విమానం!

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఓ యుద్ధ విమానం త‌మ దేశంలోని షాంఘై న‌గ‌రానికి స‌మీపంలోకి వ‌చ్చింద‌ని చైనా నిఘా విభాగం తెలిపింది. అమెరికాకు చెందిన జ‌లాంత‌ర్గామి నిరోధ‌క యుద్ధ‌విమానం చైనా తూర్పు ప్రాంతంలోని షాంఘై న‌గ‌రానికి 100 కి.మీ. కంటే త‌క్కువ దూరంలోకి వ‌చ్చింద‌ని ద‌క్షిణ చైనా స‌ముద్రంపై ప్ర‌త్యేక దృష్టి సారించిన నిఘా విభాగం వెల్ల‌డించింది. అయితే అమెరికా యుద్ధ విమానం త‌మ భూభాగం స‌మీపంలోకి వ‌చ్చినందుకు ప్ర‌తిగా.. చైనా త‌మ దేశంలోని అమెరికా రాయ‌బార కార్యాల‌యాల‌ను మూసివేయ‌నున్న‌ట్లు తెలిపింది. దీంతో రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు త‌లెత్తాయి. 

అమెరికాకు చెందిన ఏపీ-8ఏ జలాంత‌ర్గామి నిరోధ‌క విమానం, ఈపీ-3ఈ నిఘా విమానం ఆదివారం తైవాన్ జ‌ల‌సంధిలోకి ప్ర‌వేశించాయి. జెజియాంగ్‌, ఫుజియాన్ తీరాల్లో ఆదివారం ఆ రెండు విమానాలు విహ‌రించాయ‌ని హాంగ్‌కాంగ్‌కు చెందిన సౌత్ చౌనా మార్నింగ్ పోస్ట్ ప‌త్రికలో సోమ‌వారం ఓ క‌థ‌నం ప్ర‌చురిత‌మైంది. పీ-8ఏ ఎయిర్‌క్రాఫ్ట్ షాంఘైకి 76.5 కిలోమీట‌ర్ల స‌మీపానికి వ‌చ్చింద‌ని ఆ క‌థ‌నంలో పేర్కొన్న‌ది.                                    


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo