ఆదివారం 29 మార్చి 2020
International - Mar 21, 2020 , 08:31:17

వైట్‌హౌజ్ ఉద్యోగికి క‌రోనా పాజిటివ్‌

వైట్‌హౌజ్ ఉద్యోగికి  క‌రోనా పాజిటివ్‌

హైద‌రాబాద్‌:  అమెరికా ఉపాధ్య‌క్షుడు మైక్ పెన్స్ వ‌ద్ద ప‌నిచేసే బృందంలో ఒక‌రికి క‌రోనా వైర‌స్ సోకింది.  దీంతో వైట్‌హౌజ్ అప్ర‌మ‌త్త‌మైంది. వైట్‌హౌజ్‌లో ప‌నిచేస్తున్న వారిలో వైర‌స్ సోకిన తొలి వ్య‌క్తిగా అత‌న్ని గుర్తించారు.  అమెరికాలో ఇప్ప‌టి వ‌ర‌కు ఆ వైర‌స్ వ‌ల్ల 230 మంది చ‌నిపోయారు.  అయితే వైర‌స్ సోకిన వ్య‌క్తితో అధ్య‌క్షుడు ట్రంప్ కానీ, ఉపాధ్య‌క్షుడు పెన్స్ కానీ కాంటాక్ట్‌లోకి రాలేద‌ని వైట్‌హౌజ్ ప్రెస్ సెక్ర‌ట‌రీ కేటీ మిల్ల‌ర్ తెలిపారు.  ఇటీవ‌ల ట్రంప్ క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నా. ఆ టెస్టులో అత‌ను నెగ‌టివ్‌గా తేలారు.  అమెరికాలో క‌రోనా సోకిన వారి సంఖ్య 20 వేల‌కు చేరుకున్న‌ది.


logo