మంగళవారం 24 నవంబర్ 2020
International - Oct 25, 2020 , 10:00:11

అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ సహాయకుడికి కొవిడ్‌ పాజిటివ్‌

అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ సహాయకుడికి కొవిడ్‌ పాజిటివ్‌

వాషింగ్టన్‌ : అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్‌షార్ట్‌ శనివారం కొవిడ్-19 పాజిటివ్‌గా పరీక్షించారు. దీంతో మార్క్‌షార్ట్‌ క్వారంటైన్‌కు వెళ్లాడు. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌కు సహకరిస్తున్నారని పెన్స్‌ ప్రతినిధి డెవిన్‌ ఓమాలే ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, ఉపాధ్యక్షుడు పెన్స్‌తో పాటు ఆయన భార్య ఇద్దరికీ పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ వచ్చినట్లు పేర్కొన్నారు. పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని తెలిపారు. వచ్చే నెల 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండగా.. రిపబ్లికన్స్‌ పార్టీ తరఫున డోనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా మరోసారి బరిలోకి దిగుతుండగా.. మైక్‌ పెన్స్‌ ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. వైట్‌ హౌస్‌ వైద్యులను సంప్రదించి పెన్స్‌ ఎన్నికలకు ముందే తన ప్రచారాన్ని కొనసాగిస్తారని ప్రతినిధి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అమెరికాలో శనివారం ఒకే 89వేల కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటి వరకు వైరస్‌ ప్రభావంతో 2.24లక్షల మంది మరణించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.