శుక్రవారం 22 జనవరి 2021
International - Jan 13, 2021 , 08:27:10

నేను ఆ ప‌ని చేయ‌లేను: ‌అమెరికా ఉపాధ్య‌క్షుడు‌

నేను ఆ ప‌ని చేయ‌లేను: ‌అమెరికా ఉపాధ్య‌క్షుడు‌

వాషింగ్ట‌న్‌: అమెరికా క్యాపిట‌ల్‌పై దాడికి కార‌ణ‌మైన అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అర్ధాంత‌రంగా ప‌ద‌వీచ్యుతుడిని చేయ‌డం కోసం 25వ రాజ్యంగ స‌వ‌ర‌ణ‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డంపై ఇటు ప్ర‌తినిధులు స‌భ‌లో, అటు సెనేట్‌లో డిబేట్ న‌డుస్తున్న‌ది. మ‌రోవైపు ట్రంప్‌కు ఉద్వాస‌న ప‌లుక‌డానికి 25వ స‌వ‌ర‌ణ‌ను ప్ర‌వేశ‌పెట్టాలంటూ ఉపాధ్య‌క్షుడు మైక్ పెన్స్‌పై కూడా డెమోక్రాట్‌లు ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మైక్ పెన్స్ అమెరికా ప్ర‌తినిధుల సభ స్పీక‌ర్ నాన్సీ పెలోసీకి లేఖ రాశారు. 

అధ్య‌క్షుడికి ఉద్వాసన పలకడానికి 25వ సవరణను ప్రవేశపెట్టాల‌న్న డెమోక్రాట్ల విజ్ఞ‌ప్తిని తాను తోసిపుచ్చుతున్నాన‌ని ఆ లేఖ‌లో పేర్కొన్నారు. అధ్య‌క్షుడు ట్రంప్ ప‌ద‌వీకాలం కేవ‌లం 8 రోజులు మాత్ర‌మే మిగిలి ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో మీరు, డెమోక్రాట్‌లు 25వ స‌వ‌ర‌ణ‌ను ప్ర‌వేశ‌పెట్టాలంటూ న‌న్ను, క్యాబినెట్‌ను డిమాండ్ చేస్తున్నారు. కానీ అలా చేయ‌డం మ‌న దేశ ప్ర‌యోజ‌నాల‌కు మంచిది కాద‌ని నేను భావిస్తున్నాను అని ఆ లేఖ‌లో పేర్కొన్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo