మంగళవారం 02 మార్చి 2021
International - Jan 18, 2021 , 22:54:09

క‌మ‌లా హ‌ర్రీస్ రాజీనామా.. దేనికంటే!

క‌మ‌లా హ‌ర్రీస్ రాజీనామా.. దేనికంటే!

వాషింగ్ట‌న్‌: అమెరికా ఉపాధ్య‌క్షురాలిగా ఎన్నికైన డెమోక్రాట్ నేత క‌మ‌లా హ‌ర్రీస్ త‌న సెనెట‌ర్ ప‌ద‌వికి సోమ‌వారం అధికారికంగా రాజీనామా చేశారు. అమెరికాలోని ఎగువ‌స‌భ సెనెట్‌లో ఆమె ప‌ద‌వీ కాలం కూడా ముగిసింది. బుధ‌వారం దేశ అధ్య‌క్షుడిగా జో బైడెన్‌తోపాటు ఉపాధ్య‌క్షురాలిగా ఆమె ప్ర‌మాణం చేయ‌నున్నారు. ఇదిలా ఉంటే అమెరికా ఉపాధ్య‌క్షురాలిగా ఎన్నికైన తొలి న‌ల్ల జాతీయురాలు, తొలి ద‌క్షిణాసియా మ‌హిళ‌గా కూడా క‌మ‌లా హ‌ర్రీస్ రికార్డు నెల‌కొల్ప‌నున్నారు. 

క‌మ‌లా హ‌ర్రీస్ త‌న రాజీనామా లేఖ‌ను కాలిఫోర్నియా గ‌వ‌ర్న‌ర్ గావిన్ న్యూస‌మ్‌కు పంపార‌ని ఆమె స‌న్నిహితులు తెలిపారు. 2016 న‌వంబ‌ర్‌లో సెనెట్‌కు ఎన్నికైన హ‌ర్రీస్‌, 2017 జ‌న‌వ‌రిలో ప్ర‌మాణం చేశారు. కాలిఫోర్నియా నుంచి సెనెట్‌కు ఎన్నికైన తొలి న‌ల్ల జాతీయురాలిగా కూడా ఆమె రికార్డు నెల‌కొల్పారు. సెనెట్‌కు ఎన్నికైన స‌మ‌యంలో కాలిఫోర్నియా అటార్నీ జ‌న‌ర‌ల్‌గానూ ఆమె వ్య‌వ‌హ‌రించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo