గురువారం 28 మే 2020
International - Apr 15, 2020 , 09:40:29

ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు నిధులు నిలిపేస్తున్నాం : ట‌్రంప్‌

ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు నిధులు నిలిపేస్తున్నాం : ట‌్రంప్‌

హైద‌రాబాద్‌: ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు ఫండింగ్‌ను నిలిపివేస్తున్న‌ట్లు అమెరికా స్ప‌ష్టం చేఇసంది. నిధుల‌ను నిలిపివేయాల‌ని త‌మ అధికారుల‌ను ఆదేశించిన‌ట్లు ట్రంప్ తెలిపారు. హౌట్‌హౌజ్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్రాథ‌మిక క‌ర్త‌వ్య నిర్వ‌హ‌ణ‌లో డ‌బ్ల్యూహెచ్‌వో విఫ‌ల‌మైంద‌ని ట్రంప్ విమ‌ర్శించారు.  క‌రోనా వైర‌స్ సంక్ర‌మ‌ణ‌ను అరిక‌ట్ట‌డంలో డ‌బ్ల్యూహెచ్‌వో ఎటువంటి చేయూత‌ను ఇవ్వ‌లేద‌న్నారు. చైనాలో వైర‌స్ ఛాయ‌లు క‌నిపించిన త‌ర్వాత‌.. ఆ విష‌యాన్ని ప్ర‌పంచ‌దేశాల‌కు డ‌బ్ల్యూహెచ్‌వో తెలియ‌జేయ‌లేద‌న్నారు.  నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన డ‌బ్ల్యూహెచ్‌వోపై దానికి బాధ్య‌త తీసుకోవాల‌న్నారు. చైనాకు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు గ‌తంలోనూ డ‌బ్ల్యూహెచ్‌వోపై ట్రంప్ ఆరోప‌ణ‌లు చేశారు.  క‌రోనా క‌ట్ట‌డి నియంత్ర‌ణ‌లో ట్రంప్ విఫ‌ల‌మైన‌ట్లు అమెరికాలో ఆరోప‌ణ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఆయ‌న డ‌బ్ల్యూహెచ్‌వోపై తిరుగుబాటుకు దిగారు. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ప‌నితీరుపై మా అధికారులు స‌మీక్ష చేస్తున్నార‌ని, కానీ ఈ లోపు నిధుల‌ను ఆపివేయాల‌ని ఆదేశించాన‌ని, వైర‌స్ విష‌యాన్ని ఆ సంస్థ క‌ప్పిపుచ్చింద‌న్నారు.  


logo