మంగళవారం 14 జూలై 2020
International - May 30, 2020 , 09:36:46

చైనా విద్యార్థుల‌పై అమెరికా ఆంక్ష‌లు..

చైనా విద్యార్థుల‌పై అమెరికా ఆంక్ష‌లు..

హైద‌రాబాద్‌: హాంగ్‌కాంగ్‌కు అమెరికా క‌ల్పిస్తున్న ప్ర‌త్యేక అధికారాల‌ను ర‌ద్దు చేయ‌నున్న‌ట్లు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. హాంగ్‌కాంగ్ భ‌ద్ర‌త బిల్లుకు చైనా ఆమోదం తెలిపిన నేప‌థ్యంలో.. చైనా తీరు ప‌ట్ల అమెరికా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. హాంగ్‌కాంగ్‌ను చైనా ఆధీనంలోకి తీసుకుంటున్న తీరును ఆయ‌న ఖండించారు. అందుకే అమెరికా వ‌ర్సిటీల్లో చేరే చైనా విద్యార్థులను అడ్డుకోనున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. వివాదాస్ప‌దంగా మారిన హాంగ్‌కాంగ్ సెక్యూర్టీ చ‌ట్టం ప‌ట్ల అమెరికా,  బ్రిట‌న్ దేశాలు యూఎన్ భ‌ద్ర‌తా మండ‌లిలో నిర‌స‌న వ్య‌క్తం చేశారు. చైనా జోక్యం చేసుకోవ‌డం వ‌ల్ల హాంగ్‌కాంగ్ హోదాకు విఘాతం ఏర్ప‌డుతున్న‌ట్లు ట్రంప్ ఆరోపించారు. ఇది హాంగ్‌కాంగ్ ప్ర‌జ‌ల‌కు విషాద‌క‌ర‌మ‌న్నారు.  logo