శనివారం 06 జూన్ 2020
International - Apr 28, 2020 , 14:35:31

ఆ దేశాల‌కు మా టెక్నాల‌జీ ఇవ్వంః అమెరికా

ఆ దేశాల‌కు మా టెక్నాల‌జీ ఇవ్వంః అమెరికా

కోవిడ్‌-19 వైర‌స్‌ను అదుపు చేయలేక తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న అమెరికా అధ్య‌క్షుడు మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. చైనా, ర‌ష్యా, వెనుజులాకు అమెరికా సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఇవ్వ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించారు. సాధార‌ణ పౌరుల అవ‌స‌రాల‌కోసం త‌మ టెక్నాలజీని పొందుతున్న ఈ దేశాలు దానితో ఆయుధాలు, యుద్ద‌విమానాలు, నిఘా యంత్రాలు త‌యారు చేస్తున్నాయ‌ని ఆరోపించారు. అమెరికా నుంచి కొన్న వ‌స్తువుల‌తో సైనిక ప‌రిక‌రాలు త‌యారు చేసిన చ‌రిత్ర ఉన్న ఈ దేశాల‌కు త‌మ టెక్నాల‌జీని విక్ర‌యించే విష‌యంలో అద‌న‌పు ప‌రిమితులు విధించటం చాలా కీల‌క‌మైన‌ద‌ని అమెరికా వాణిజ్య మంత్రి విల్‌బ‌ర్ రాస్ అన్నారు.  


logo