గురువారం 28 మే 2020
International - Apr 23, 2020 , 13:09:12

దాగుడు మూతలు..వాషింగ్ మెషిన్ లో ఇరుక్కుపోయింది..వీడియో

దాగుడు మూతలు..వాషింగ్ మెషిన్ లో ఇరుక్కుపోయింది..వీడియో

న్యూయార్క్ : అమెరికాలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోన్ననేప‌థ్యం లో లాక్ డౌన్ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్ర‌జ‌లంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మైపోయారు. అయితే లాక్ డౌన్ స‌మ‌యంలో టైం పాస్ కోసం అమ‌రి డ్యాన్సీ (18) తన స్నేహితుల‌తో దాగుడు మూత‌లాట (హై అండ్ సీక్‌)ఆడింది.

ఆటలో భాగంగా అమ‌రి డ్యాన్సీ అంద‌రూ ఇంట్లో అక్క‌డ‌క్క‌డా దాక్కున్నారు. కానీ అమ‌రి డ్యాన్సీ మాత్రం వాషింగ్ మెషిన్ లోకి దిగి దాక్కుంది. ఇంత‌లోనే ఆట ముగియ‌గా అంద‌రూ బ‌య‌ట‌కు వ‌చ్చారు. కానీ అమ‌రి డ్యాన్సీ మాత్రం వాషింగ్ మెషిన్ లోనే ఇరుక్కుపోయింది.

వెంట‌నే న్యూయార్క్ ఎమ‌ర్జెన్సీ స‌ర్వీస్ బృందం స‌భ్యులు ఫేస్ మాస్కులతో అక్క‌‌డికి చేరుకు ని అమ‌రి డ్యాన్సీని.. అందులో నుంచి సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీశారు. మేం బేస్ మెంట్ లోకి వెళ్లే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో..ఇంట్లో కొంద‌రం బెడ్ కింద, ఇత‌ర ప్ర‌దేశాల్లో దాక్కున్నాం. త‌నకేం ప‌ర్వాలేద‌ని, కేవ‌లం మెషిన్ లో  ఇరుక్కున్నార‌ని అమ‌రి డ్యాన్సీ చెప్పింది. పిల్ల‌లంటే పిల్లలే అంటూ అమ‌రి డ్యాన్సీ ఆంటీ ఈ వీడియోను తీసింది. వీడియోలో ఎమ‌ర్జెన్సీ టీం న‌వ్వ‌డాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo