శుక్రవారం 07 ఆగస్టు 2020
International - Jul 02, 2020 , 18:12:34

అమెరికాలోనూ టిక్‌టాక్‌ బ్యాన్‌ ?

అమెరికాలోనూ టిక్‌టాక్‌ బ్యాన్‌ ?

టిక్‌టాక్ పిచ్చి ఒక్క భార‌త్‌లోనే కాదు ప్ర‌పంచ‌మంతా ఉంది. మ‌న‌వ‌ల్ల చైనా లాభం పొందుతున్న‌ప్ప‌టికీ మ‌న‌పైనే దాడికి దిగుతున్నారు. వీరిని దెబ్బ‌కొట్టాలంటే ఆర్థికంగానే సాధ్య‌మ‌వుతుంద‌ని భార‌త్ నిర్ణ‌యించుకున్న‌ది. ఒక‌టి కాదు, రెండు కాదు.. ఏకంగా 59 యాప్‌ల‌ను తొలిగించి చైనాకు ఓ రేంజ్‌లోనే బుద్ధి చెప్పింది భార‌త్‌. ఇప్పుడు ఇదే బాట‌లో అమెరికా కూడా న‌డువ‌నున్న‌ట్లు స‌మాచారం.

భారత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రిపబ్లికన్‌ సెనెటర్‌ జాన్‌ కోర్నిన్‌ సహా పలువురు ప్రముఖులు భారత్‌కు మద్దతు తెలిపారు. అమెరికాలోనే 4 కోట్ల‌కు పైగా టిక్‌టాక్ వాడుతున్నారు. మ‌న‌వ‌ల్ల చైనా ఆర్థికంగా లాభ‌ప‌డుతున్న‌ది. అయినా మ‌న‌కు హానిక‌లిగిస్తున్న‌ద‌ని  అమెరికాలోని ప్రభుత్వ ఉద్యోగులు టిక్‌టాక్ యాప్‌ను ఉపయోగించరాదని, దాన్నిఎట్టి పరిస్థితుల్లో మొబైల్‌లో డౌన్లోడ్ చేసుకోరాదంటూ మార్చి నెలలోనే బిల్లులు కూడా ప్రవేశపెట్టారు. ప్రస్తుతం వీటిపై నిర్ణయం పెండింగులో ఉంది. అంతేకాకుండా ప‌లువురు మీడియా ప్ర‌తినిధులు కూడా గ‌ళ‌మెత్తుతున్నారు. మ‌రి అమెరికా ఎప్పుడు టిక్‌టాక్ బ్యాన్ చేస్తుందో వేచి చూడాల్సిందే..!logo