సోమవారం 18 జనవరి 2021
International - Dec 28, 2020 , 01:38:06

దలైలామాకు అమెరికా దన్నుకొత్తచట్టం ఆమోదం

దలైలామాకు అమెరికా దన్నుకొత్తచట్టం ఆమోదం

న్యూఢిల్లీ: బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా వారుసుడిని ఎంచుకునే హక్కు టిబెటన్లకే కల్పిస్తూ అమెరికా ఇటీవల ఓ బిల్లును ఆమోదించడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఈ బిల్లు ద్వారా టిబెట్‌కు మద్దతు ప్రకటించిన అమెరికా..తదుపరి దలైలామా ఎంపిక విషయంలో చైనా జోక్యం చేసుకుంటే తీవ్ర ఆంక్షలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. ఈ క్రమంలో టిబెట్‌ పాలసీ విషయం లో భారత్‌ తన వైఖరిని పునరాలోచించుకోవాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. సరిహద్దుల్లో చైనా దు స్సాహసాల నేపథ్యంలో అమెరికా ఈ బిల్లు తేవటం చైనాపై ఒత్తిడి తెచ్చేందుకు భారత్‌కు సువర్ణావకాశమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.