శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Sep 11, 2020 , 02:12:52

అమెరికా వ్యోమనౌకకు కల్పనాచావ్లా పేరు

అమెరికా వ్యోమనౌకకు కల్పనాచావ్లా పేరు

వాషింగ్టన్‌: దివంగత నాసా వ్యోమగామి కల్పనాచావ్లాకు నివాళిగా అమెరికా తమ వాణిజ్య కార్గో అంతరిక్ష నౌకకు ఆమె పేరును పెట్టనున్నట్టు ప్రకటించింది. అమెరికా డిఫెన్స్‌ సంస్థ నార్తోప్‌ గ్రుమ్మస్‌ తమ నౌక ‘సిగ్నస్‌ క్యాప్యూల్‌'కు ‘ఎస్‌ఎస్‌ కల్పనా చావ్లా’ అని పేరు పెడతామని పేర్కొన్నది. అంతరిక్ష యాత్ర చేసిన మొట్టమొదటి భారత సంతతి మహిళ కల్పనా చావ్లా.


logo