శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Jul 16, 2020 , 07:50:03

అమెరికాలో క‌రోనా ఉగ్ర‌రూపం.. ఒకేరోజు 67 వేల కేసులు

అమెరికాలో క‌రోనా ఉగ్ర‌రూపం.. ఒకేరోజు 67 వేల కేసులు

వాషింగ్ట‌న్‌: అమెరికాలో క‌రోనా వైర‌స్‌ ఉగ్ర‌రూపం దాల్చింది. దేశంలో గ‌త ప‌ది రోజులుగా ప్ర‌తిరోజు 55 వేల నుంచి 65 వేల పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. తాజాగా గ‌త 24 గంట‌ల్లో దేశంలో రికార్డుస్థాయిలో 67,632 క‌రోనా కేసులు కొత్త‌గా న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 36,16,747కు చేరింది. ఈ వైర‌స్ వ‌ల్ల ఇప్ప‌టివ‌ర‌కు 1,40,140 మంది మృతిచెందారు. మ‌రో 18,30,645 మంది చికిత్స పొందుతుండ‌గా, 16,45,962 మంది బాధితులు కోలుకున్నారు.  

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 1,36,91,570 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఈవైర‌స్‌తో 5,86,820 మంది మ‌ర‌ణించారు. మొత్తం న‌మోదైన కేసుల్లో 80,37,140 మంది బాధితులు కోలుకోగా, 5,067,610 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.


logo