గురువారం 04 జూన్ 2020
International - Apr 10, 2020 , 18:26:33

కబేళాలు మూసేయండి.. చైనాకు అమెరికా సెనేటర్ల విజ్ఞప్తి

కబేళాలు మూసేయండి.. చైనాకు అమెరికా సెనేటర్ల విజ్ఞప్తి

హైదరాబాద్: కోవిడ్-19 వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో కబేళాలను మూసివేయాలని అమెరికా చట్టసభల సభ్యులు కొందరు చైనాకు విజ్ఞప్తి చేశారు. తాజా మాంసాలు, మాంస ఉత్పత్తులు, చేపలు మొదలైనవి అమ్మే కబేళాలు జంతువుల నుంచి మనుషులకు ఇన్ఫెక్షన్లు వ్యాపింపజేసే ప్రమాదం ఉంది కనుక తక్షణమే వాటికి తాళం పెట్టాలని పాలక, విపక్షాలకు చెందిన 11 మంది సెనేటర్ల బృందం అమెరాలోని చైనా రాయబారి కుయి తియంకాయ్‌కి రాసిన ఒక లేఖలో పేర్కొన్నది.  ఇప్పుడు ప్రపంచాన్ని స్తంభింపజేసిన నూతన కరోనా వైరస్ వూహాన్ మాంసాహార మార్కెట్ లో క్రమంగా విక్రయించిన ఓ వన్యప్రాణి నుంచి మనుషులకు సోకిందని చైనా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం డైరెక్టర్ గావ్ ఫూ నిర్ధారించిన సంగతిని వారు ఈ సందర్భంగా గుర్తుచేశారు. చైనీయులతో పాటుగా ఇతరదేశాల ప్రజలను అదనపు సమస్యల నుంచి కాపాడేందుకు  ఆ మాంసాహార అంగళ్లను మూసివేయడం ఒక్కటే మార్గమని తమ లేఖలో వారు పేర్కొన్నారు. ఈ బృందంలోని ప్రముఖుల్లో రిపబ్లికన్లు మిట్ రామ్నీ లిండ్సే గ్రాహమ్, డెమొక్రాట్ క్రిస్ కూన్స్ ఉన్నారు.


logo