శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Aug 18, 2020 , 17:55:10

భారత్ సరిహద్దులో చైనా ఆగడాలపై అమెరికా తీర్మానం

భారత్ సరిహద్దులో చైనా ఆగడాలపై అమెరికా తీర్మానం

వాషింగ్టన్: భారత్ సరిహద్దులో చైనా ఆగడాలపై అమెరికా చట్ట సభలో ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వద్ద యధాతథ స్థితిని మార్చడానికి చైనా సైన్యం దూకుడుగా వ్యవహరించడాన్ని అమెరికా సెనేటర్ జాన్ కార్నిన్, ఇంటెలిజెన్స్‌పై సెనేట్ సెలెక్ట్ కమిటీ సభ్యుడైన మార్క్ వార్నర్ ఖండించారు. జూన్ 15న లడఖ్‌ సరిహద్దులోని గాల్వాన్ లోయ వద్ద ఇరు దేశాల సైన్యం మధ్య జరిగిన ఘర్షణను ప్రస్తావించారు. పెట్రోలింగ్ చేస్తున్న భారత జవాన్ల పట్ల చైనా సైనికులు వేధింపులకు పాల్పడంతోపాటు వివాదస్పద ప్రాంతాల్లో దళాల మోహరింపు, సరిహద్దులో చైనా అక్రమంగా చేపడుతున్న నిర్మాణాలను వారు తప్పుపట్టారు. అమెరికా చట్టసభలో ఈ మేరకు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు సెనేటర్ జాన్ కార్నిన్ కార్యాలయం తెలిపింది.

logo