శుక్రవారం 07 ఆగస్టు 2020
International - Jul 11, 2020 , 18:58:58

24 గంటల్లో 66,600 కరోనా పాజిటివ్‌ కేసులు

24 గంటల్లో 66,600 కరోనా పాజిటివ్‌ కేసులు

వాషింగ్టన్‌ డీసీ: కొవిడ్‌-19 కేసుల్లో అగ్రరాజ్యం అమెరికా అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 66,600 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 802 మంది మరణించారు. ఈ వివరాలను జాన్‌ హాప్కిన్స్‌ విశ్వవిద్యాలయం వెల్లడించింది.   

అంతకుముందు రోజు అమెరికాలో 63,200 కేసులు నమోదయ్యాయి. 990 మంది మృత్యువాతపడ్డారు. దీంతో ఆ దేశంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 3.1 మిలియన్లకు చేరుకుంది 9,83,000 మందికి పైగా కోలుకున్నారు, 1,34,000 మందికిపైగా మృత్యువాతపడ్డారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo