గురువారం 04 జూన్ 2020
International - Apr 03, 2020 , 12:06:22

కరోనాతో కుదేలవుతున్న అమెరికా.. ఒకేరోజు 884 మంది మృతి

కరోనాతో కుదేలవుతున్న అమెరికా.. ఒకేరోజు 884 మంది మృతి

హైదరాబాద్‌: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్‌తో మరణించిన వారి సంఖ్య 5300కు చేరింది. గత 24 గంటల్లో 884 మంది మరణించారు. దీంతో కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడంలో అలసత్వం ప్రదర్శించిన ఇటలీ, స్పెయిన్‌ సరసన అమెరికా చేరింది. ఈ మూడు దేశాలు మృతుల సంఖ్యలో కరోనా వైరస్‌ పుట్టిళ్లు చైనాను ఎప్పుడో అధిగమించాయి. అదేవిధంగా కరోనా కేసుల సంఖ్యలో కూడా అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతున్నది. ఇప్పటి వరకు ఆ దేశంలో 2,27,000 కేసులు నమోదయ్యాయి. ఈ ప్రమాదకరమైన వైరస్‌ అమెరికా ఆర్థికవ్యవస్థపై కూడా పెను ప్రభావం చూపుతున్నది. ఇప్పటికే ఆ దేశంలో రవాణాతో సహా అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో తమకు నిరుద్యోగ ప్రయోజనాలు చెల్లించాలని 6.6 మిలియన్ల అమెరికన్లు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.


logo