మంగళవారం 20 అక్టోబర్ 2020
International - Oct 15, 2020 , 08:42:11

మాన‌వాళికి మరో వైరస్ ముప్పు!

మాన‌వాళికి మరో వైరస్ ముప్పు!

వాషిం‌గ్టన్‌: కరోనా మహ‌మ్మా‌రితో యావత్‌ ప్రపంచం ఉక్కి‌రి‌బి‌క్కిరి అవు‌తున్న ప్రస్తుత తరు‌ణంలో శాస్త్ర‌వే‌త్తలు మరో పిడు‌గు‌లాంటి వార్త చెప్పారు. పందు‌లలో డయే‌రి‌యాకు కార‌ణ‌మయ్యే కరోనా వైర‌స్‌కు చెందిన ఒక రకం వైరస్‌ మను‌షు‌లకూ వ్యాప్తి చెందే ప్రమా‌ద‌ముం‌దని గుర్తిం‌చారు. మను‌షుల ఆరో‌గ్యంపై, ప్రపంచ ఆర్థిక వ్యవ‌స్థపై ఇది ప్రతి‌కూల ప్రభావం చూప‌గ‌ల‌దని అమె‌రి‌కా శాస్త్ర‌వే‌త్తలు హెచ్చ‌రి‌స్తు‌న్నారు. తొలుత 2016లో చైనాలో ఈ వైర‌స్‌ను కను‌గొ‌న్నారు. దీనిని సాడ్స్‌–‌కోవ్‌ వైర‌స్‌గా పిలు‌స్తు‌న్నారు. గబ్బి‌లాల నుంచి ఇది పందు‌లకు వ్యాపిం‌చి‌నట్లు గుర్తిం‌చారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo