శనివారం 08 ఆగస్టు 2020
International - Aug 02, 2020 , 00:47:40

రష్యా, చైనా వాక్సిన్లు వాడబోము: ఫౌచి

రష్యా, చైనా వాక్సిన్లు వాడబోము: ఫౌచి

వాషింగ్టన్‌, ఆగస్టు 1: కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు రష్యా, చైనా తయారుచేసిన వ్యాక్సిన్లను తాము వినియోగంచబోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సలహాదారు, అంటువ్యాధుల నిపుణుడు ఆంటొనీ ఫౌచి ప్రకటించారు. ఆ దేశాల్లో సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకుండా వ్యాక్సిన్లు తయారుచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘వ్యాక్సిన్‌ సరఫరా చేసేముందు అన్ని పరీక్షలు నిర్వహించాలి. మా ప్రమాణాలకు సరితూగని ఏ వ్యాక్సిన్‌నూ మేము వాడబోము’ అని ఆయన అన్నారు. 


logo