మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Jul 26, 2020 , 08:10:07

బ్రెజిల్‌లో 51 వేలు, అమెరికాలో 68 వేల క‌రోనా కేసులు

బ్రెజిల్‌లో 51 వేలు, అమెరికాలో 68 వేల క‌రోనా కేసులు

వాషింగ్ట‌న్‌: రోజువారీ క‌రోనా కేసుల్లో అమెరికా, బ్రెజిల్ దేశాల మ‌ధ్య‌‌ పోటాపోటీ కొన‌సాగుతున్న‌ది.  ప్ర‌పంచంలో అత్య‌ధిక క‌రోనా కేసుల జాబితాలో ఈ రెండు దేశాలు అగ్ర‌స్థానాల్లో కొన‌సాగుతున్నాయి. ఈ ఉత్త‌ర‌, ద‌క్షిణ అమెరికా దేశాల్లో క‌రోనా కేసులు అంత‌కంత‌కూ పెరుగుతూనే ఉన్నాయి. 

అగ్ర‌రాజ్యం అమెరికాలో క‌రోనా ఉధృతి కొన‌సాగుతూనే ఉన్న‌ది. గ‌త 24 గంట‌ల్లో 68,212 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో మొత్తం క‌రోనా కేసులు 41,74,437కుపెరిగింది. నిన్న ఉద‌యం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు కొత్త‌గా 1067 మంది చ‌నిపోవ‌డంతో మృతుల సంఖ్య 1,46,391కి పెరిగింది. దేశంలో గ‌త 12 రోజులుగా 60 వేల‌కు పైగా పాజిటివ్ కేసులు వ‌స్తుండ‌గా, గ‌త నాలుగు రోజులుగా ప్ర‌తిరోజు వెయ్యి మందికిపైగా చ‌నిపోతున్నారు. దేశంలోని కాలిఫోర్నియా, టెక్సాస్‌, అల‌బామా, ఫ్లోరిడా రాష్ట్రాల్లో అత్య‌ధిక కేసులు న‌మోద‌వుతున్నాయి.  


బ్రెజిల్‌లో గ‌త 24 గంట‌ల్లో 51,147 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో మొత్తం క‌రోనా కేసులు 23,94,513కు చేరాయి. ఇప్ప‌టివ‌ర‌కు 16 ల‌క్ష‌ల మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. కొత్త‌గా 1211 మంది మ‌ర‌ణించ‌డంతో క‌రోనా మృతులు 86,449కి పెరిగాయి. 

దేశంలో శుక్ర‌వారం 55891 పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, 1150 మంది మ‌ర‌ణించారు. తాజాగా నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో బ్రెజిల్ అధ్య‌క్షుడు బొల్సొనారోకు నెగెటివ్ వ‌చ్చింది. ఈనెల 7న క‌రోనా త‌న‌కు క‌రోనా సోకిందని ఆయ‌న స్వ‌యంగా ప్ర‌కటించారు. అనంత‌రం రెండుసార్లు ప‌రీక్ష నిర్వ‌హించ‌గా పాజిటివ్ వ‌చ్చింది.    


logo