శుక్రవారం 05 జూన్ 2020
International - May 19, 2020 , 10:58:36

అమెరికాలో ఒకే రోజు 21,500 కరోనా కేసులు

అమెరికాలో ఒకే రోజు 21,500 కరోనా కేసులు

న్యూయార్క్‌: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 21,551 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ ప్రభావంతో కొత్తగా 785 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 15,03,308కి చేరింది. ఇప్పటివరకు 90,347 మంది బాధితులు మృతిచెందారు. ఇది కరోనా వైరస్‌తో ప్రపంచ మొత్తం నమోదైన మరణాల్లో మూడో వంతు కావడం గమనార్హం. 

దేశంలోని మొత్తం 50 రాష్ర్టాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. న్యూయార్క్‌లో అత్యధికంగా 3,51,371 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 28,339 మంది మరణించారు. న్యూజెర్సీలో ఇప్పటివరకు 1,48,240 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక్కడ వైరస్‌ ప్రభావంతో 10,439 మంది మృతిచెందారు. కరోనా కేసుల్లో ఇల్లినాయిస్‌, మసాచుసెట్స్‌, కాలిఫోర్నియా రాష్ర్టాలు వరుసగా 96,485, 87,052, 81,738 కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.


logo