శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Jul 29, 2020 , 08:40:08

అమెరికాలో 1.5 ల‌క్ష‌లు దాటిన క‌రోనా మ‌ర‌ణాలు

అమెరికాలో 1.5 ల‌క్ష‌లు దాటిన క‌రోనా మ‌ర‌ణాలు

వాషింగ్ట‌న్‌: అమెరికాలో క‌రోనా మ‌ర‌ణ మృదంగం మోగిస్తున్న‌ది. దేశంలో నిన్న ఒక్క‌రోజే 1592 మంది మ‌ర‌ణించారు. గ‌త రెండున్న‌ర నెల‌ల్లో ఒకేరోజు ఇంత మంది మ‌ర‌ణించ‌డం ఇదే మొద‌టిసారి. అమెరికాలో క‌రోనాతో ఇప్ప‌టివ‌ర‌కు 1,52,320 మంది చ‌నిపోయారు. మంగ‌ళ‌వారం కొత్త‌గా 60 వేల పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం క‌రోనా కేసులు 44,98,343కు చేరాయి. 21,85,894 మంది కోలుకోగా, 21,60,129 మంది చికిత్స పొందుతున్నారు. ఇందులో 18,992 మంది ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ది. 

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 1,68,83,791 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. నిన్న ఒక్క‌రోజే కొత్త‌గా 2,47,579 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. క‌రోనా వ‌ల్ల మంగ‌ళ‌వారం 5,567 మంది మ‌ర‌ణించ‌డంతో మొత్తం మృతుల సంఖ్య‌ 6,62,481కు చేరింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 57,70,258 యాక్టివ్ కేసులు ఉండగా, 1,04,51,052 మంది కోలుకున్నారు. 


logo